- ముఖ్యఅతిథిగా హాజరై నివాళులర్పించిన ఆల్వార్ స్వామి, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి : నడిగడ్డ తండాలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డా. బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్వార్ స్వామి నాయక్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు అభ్యుదయం, శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తని, పేద, అంటరాని వర్గాల వారు విద్య పరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగాల పరంగా ఉన్నంత స్థితిలో ఉన్నారంటే అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్లే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, తండావాసులు తిరుపతి నాయక్, సీతారాం నాయక్, రెడ్యానాయక్, హనుమంతు నాయక్, తుకారాం నాయక్, లక్ పతి నాయక్, గోపి నాయక్, నరసింహ, మోహన్ నాయక్, మహేష్, క్రిష్ణ నాయక్, దేవా నాయక్, లక్సమన్ నాయక్, సుధాకర్, అబ్రహం, కమలాకర్ పాల్గొన్నారు.