నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడతానని రవి కుమార్ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో స్థానిక కార్యవర్గ సభ్యులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. హైదర్ నగర్ డివిజన్ భాగ్యనగర్, హెచ్ఎంటి శాతవాహన, హెచ్ఎంటీ హిల్స్, నాగార్జున హోమ్స్, నిజాంపేట్ రోడ్, అల్లాపూర్ సొసైటీ కాలనీలలో చేపట్టిన పాదయాత్రలో స్థానిక కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, నరేష్, నవీన్ గౌడ్, వెలగల శ్రీనివాస్, కృష్ణంరాజు, శేషయ్య, అరుణ్, వేణుగోపాల్ యాదవ్, కేశవ్, సీతారామరాజు, వీరాచారి, ఎంకే దేవ్, సునీల్ రెడ్డి, వీరు యాదవ్, నాగరాజు కృష్ణ, బాలాజీ, నర్సింగ్, సైదమ్మ, జ్యోతి, దుర్గ రాజేశ్వరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మాటలకు కాలం చెల్లిందన్నారు. తెలంగాణ ప్రజలను ఆ పార్టీ గ్యారెంటీల పేరు చెప్పి మోసం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు చేసిన ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర ,జిల్లా పద అధికారులు, బీజేవైఎం, మహిళా మోర్చా ఈ పాదయాత్ర పాల్గొన్నారు.