రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం

  • చందానగర్ లో రఘునాథ్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : భారత రాజ్యంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని చందానగర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. చందానగర్ లోని డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పూలమల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రచించిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యమని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరేనని తెలిపారు.

చందానగర్ లో రఘునాథ్ రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను… తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామన్నారు. . కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం దేశంలోకెల్లా భాగ్యనగరంలో నిర్మించిందే ఎత్తయినదైనదన్నారు. దళితులు ధనికులు కావాలని దళిత బంధు పేరుతో పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టింది కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలిపారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాల హరీష్ రావు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కంది అశోక్, నరేందర్ బల్లా, కంది జ్ఞానేశ్వర్,రాఘవేంద్ర, రాజు, మల్లేష్, భగత్, నర్సింగ్, గోపి, శ్రీనివాస్,వీరేందర్, రాహుల్,ఉదయ్, అర్జున్,మహేందర్ ,పెంటయ్య, కార్యకర్తలు,బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here