నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లోని మై హోమ్ జువెల్ లో రెసిడెన్షియల్ కమిటీ సభ్యులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్ధించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచించి 6 గ్యారంటీలను ముందుకు తెచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే మానిఫెస్టో అమలుకు సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.