నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ దివ్య శ్రీ శక్తి అపార్ట్ మెంట్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
జగదీశ్వర్ గౌడ్ వస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పలు కాలనీ అసోసియేషన్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఐఎన్టిసి నాయకులు, మహిళా సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.