నమస్తే శేరిలింగంపల్లి: ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని మోడీ హామీ మేరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవి కుమార్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ఎమ్మార్పీఎస్ నేతలు అన్నారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ ప్రచారం చేపడుతూ జోరు పెంచారు.
మాదిగ ఉపకులాల ప్రజలు అందరు బీజేపీ రవి కుమార్ యాదవ్ ని గెలిపించాలని, బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించిన బీజేపీని తెలంగాణ రాష్ట్రములో గెలిపించాలని ప్రజలకు తెలియచేస్తూ ఇంటి ఇంటికి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.
ఎమ్మార్పీస్ ఇంచార్జి శ్యామ్లెట్ గణేష్ మాదిగ, సదానంద యాదవ్, ఎమ్మార్పీస్ అధికార ప్రతినిది ఐత రమేష్ బాబు మాదిగ, అధ్యక్షులు సింగదసారి నరేష్ మాదిగ, యువజన అధ్యక్షుడు కోడిచెర్ల ప్రేమ్ మాదిగ నాయకులు పాల్గొన్నారు.