మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ పనుల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో రూ. 3కోట్ల 95 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాణ పనులను జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉండే విదంగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో నిర్మించారని, అతి త్వరలో ఐ టి శాఖా మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు.

ప్రయివేట్ ఫంక్షన్ హాల్లకు దీటుగా.. పేద, మధ్యతరగతి ప్రజలు ఘనంగా జరుపుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ ఈ ఈ శ్రీనివాస్, ఏ ఈ సునీల్, వర్క్ ఇన్ స్పెక్టర్ మహేష్ , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బసవయ్య, రాథోడ్, సౌజన్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here