విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ శుక్రవారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. చంద్రనాయక్ నాయక్ తండా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సొంత నిధులతో సమకూర్చిన నోటు పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్పూర్తితో.. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని, ఉన్నతంగా చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాపూర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు ఈ.శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ గౌస్, నారాయణ రెడ్డి, శ్రీను నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here