జూట్ బ్యాగులు వాడుదాం..ప్లాస్టిక్ ను నియంత్రిద్దాం

నమస్తే శేరిలింగంపల్లి : రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మాదాపూర్ సీఐ తిరుపతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నియంత్రణపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కి బదులు అందరు జూట్ బ్యాగ్స్ , పేపర్ బ్యాగ్స్ వాడాలని సూచించారు.

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమ మీద ఎంతయినా ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటి, ప్లాస్టిక్ ని నియంత్రిస్తే రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవికిరణ్, వెంకటేష్, ఇక్బాల్, వెంకట్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here