నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పోరేటర్ మాధవరం రంగరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగాధర్, పోతుల రాజేందర్, చంద్రిక ప్రసాద్ గౌడ్, కాజా, నరేందర్ బల్లా , నవాజ్ పాల్గొన్నారు.