నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో గణానాథుడు విశేష పూజలందుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మాధవ్ బృందావన్ అపార్ట్ మెంట్ లోని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేపట్టారు.
అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు గోవర్ధన్ రెడ్డి తన అసోసియేషన్ సభ్యులు, నిర్వాసితులతో కలిసి గణేషుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రసాదాలు పంచిపెట్టారు. తాము చేపట్టే పనులలో సకల విఘ్నాలు తొలగించాలని వేడుకున్నారు.