నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధి నడిగడ్డ తండా మరియు సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో కొన్నెండ్లుగా సీఆర్పీఎఫ్ క్యాంపు వల్ల స్థానిక తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తండావాసులు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అయితే నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశానికి హాజరైన సీఆర్పీఎఫ్ ఏడిజి దల్జిత్ సింగ్ చౌదరిని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కలిసి నడిగడ్డ తండా మరియు సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో సీఆర్పీఎఫ్ క్యాంపును ఎత్తి వేయాలని కోరారు. ఈ సందర్బంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ లకు నడిగడ్డ తండా వాసుల తరుపున బిఆర్ ఎస్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ స్వామి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.