- ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకున్న ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు
- ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో భాగంగా రిటర్నింగ్ అధికారి ముగ్గురు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాను ప్రసాద్, శంబిపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, KP వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, అబ్రహంతో కలిసి పాల్గొని సభ్యులకు శాలవతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రావు, దామోదర్ రావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.