నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధి నాగార్జున ఎనక్లేవ్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలవతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నాగార్జున ఎనక్లేవ్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు.
ఏ చిన్న సమస్య ఐన కార్పొరేటర్ దృష్టికి గాని, తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ఎనక్లేవ్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ కాట్రగడ్డ సత్యనారాయణ , అధ్యక్షులు యూ ఎస్ రామరాజు, జనరల్ సెక్రటరీ పిడి ఆర్ కే వర్మ, వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుధీర్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ అశోక్ రెడ్డి,ఎక్జిక్యూటివ్ మెంబర్లు కేవి గోపాల్ కృష్ణ, కోసురి లక్ష్మీ, మెరినా ఎర్లాండ్, సీతారామరాజు భూపతి రాజు, వెంకటేశ్వర రావు, రామలింగ రాజు, శ్రీమన్నారాయణ మూర్తి, అడ్వైజరీ కమిటి మెంబర్లు కునపరాజు రాజన్ రాజు, కోసురి శ్రీనివాస రాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు.