నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని గౌతమి విద్యా క్షేత్ర పాఠశాలలో 20న శేరిలింగంపల్లి రెడ్డి వనభోజన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ని కలిసి వనభోజనాలకు హాజరుకావాలని ఆహ్వానించడంతో తప్పకుండా హాజరవుతానని తెలిపారు. మాజీ ఎంపీని కలిసిన వారిలో సుదర్శన్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లా సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి గున్నాల అనిల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, శేరి అంతిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దుర్గి రవీందర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, రమణారెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి .శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
