ఖాజాగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: బాలల దినోత్సవం సందర్బంగా ఖాజాగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కావ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రాంరెడ్డి, పి ఆర్ టి ఓ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి నరహరి, పి ఆర్ టి ఓ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డ్రాయింగ్ కాంపిటీషన్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here