తండ్రి జ్ఞాపకార్ధం గణేశ మండప నిర్మాణం అభినందనీయం: ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : కాలనీ సంక్షేమం కోసం, తన తండ్రి జ్ఞాపకార్థం వినాయక మండప నిర్మాణం అభినందనీయమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఏఎస్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ ఆరవ రామకృష్ణ తన తండ్రి ఆరవ సుబ్బారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
కాలనీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దుప్పెళ్లి వెంకటేశం ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ.. సమాజహితం కోసం తన వంతు సహాయం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. ఈ మండపం కాలనీలో వినాయక నవరాత్రులు నిర్వహించుకోవడానికి, కాలనీ సంక్షేమం కోసం చిన్న చిన్న సమావేశాల నిర్వహణకు ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆరవ రామకృష్ణని శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పాత్రికేయ మిత్రులు కొండా విజయ్, వినయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, ఉరిటి వెంకట్ రావు, ప్రవీణ్ , వెంకటేష్, గురు చరణ్ దుబే, భగవాన్, రామరాజు, ప్రసాద్, నరేంద్ర ప్రసాద్, లక్ష్మినారాయణ, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్ బల్లా, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి, భవాని, పార్వతి పాల్గొన్నారు.