గచ్చిబౌలి: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు అలసత్వం వదలి పెట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్ హైట్స్ లో తలెత్తిన డ్రైనేజీ సమస్యను ఆదివారం గాంధీ పరిశీలించారు. వరదనీరు రోడ్లపైకి చేరడం తో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిశీలించాలని కాలనీ వాసుల విజ్ఞప్తితో గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అవుట్ లెట్ ఏర్పాటు సాధ్య సాధ్యాలను పరిశీలించి త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని,ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించేలా చూడలని . కాలనీలో ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికివచ్చిన పరిష్కరిస్తానని ,ప్రజలకు ఎల్లా వేళల అందుబాటులో ఉంటానని ,కాలనీల అభివృద్ధికి,డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్ నాయకులు సత్యనారాయణ,కుమార్ మరియు కాలనీ వాసులు బిఎస్ మహేంద్ర, వెంకటేష్, వంశీ, ముఖేష్ ,బాషా తదితరులు పాల్గొన్నారు.