శేరిలింగంపల్లి: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు తో నిర్వహిస్తున్న పౌష్టికార వారోత్సవాల సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా, శ్రీ హనుమంతరాయ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా సురభికాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేందర్ యాదవ్ మహిళలకు పలు సూచనలు సలహాలు చేశారున్ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు. తెలంగాణ ప్రభుత్వం గర్భిణులకు, బాలింతలకు, పసిబిడ్డలకు పౌష్టికారాన్ని అందించడంలో ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుర్రం రవీందర్ రావు, వార్డు సభ్యులు శ్రీకళ, చైల్డ్ ప్రొటెక్షన్ ఫెసిలిటేటర్ దీప, డాక్టర్ చిదంబరం, హెల్త్ కో ఆర్డినేటర్ దివ్య, నాయకులు భాగ్యలక్ష్మీ, మమత, రేబాక, తులసీరాం, రాజేశ్వరీ, గర్భిణీస్త్రీలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.