మళ్ళీ బిఆర్ ఎస్ రావడం ఖాయం: ప్రవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు

  • ప్రభుత్వ విప్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీకి మూడోసారి శాసన సభ్యులుగా టికెట్ కేటాయించినందుకు గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కమిటీ సభ్యులు.

పేదల పక్షపాతి శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ మూడోసారి శాసనసభ్యులు అయ్యి రాష్ట్ర మంత్రి కావడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే శేరిలింగంపల్లి ప్రైవేటు ఉద్యోగుల సంఘం కమిటీ సభ్యులు, నాయకులు గాంధీ నివాసంలో కలిసి పెద్ద గజమాలతో శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు డాక్టర్ గంగాధర్ రావు, విద్యాశాఖ విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్ పి వై రమేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు దండగుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అంజన్ రావు, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్ గుప్తా, మీడియా సెల్ కన్వీనర్ ఎర్ర యాకయ్య రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు చంద్రమౌళి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జి. శ్రావణిరెడ్డి ఉపాధ్యక్షురాలు పుష్పామన్యం, విజయలక్ష్మి మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షురాలు మంజుల శేర్లింగంపల్లి అధ్యక్షులు సురేష్ నాయక్ , బాలస్వామి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here