నమస్తే శేరిలింగంపల్లి: నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, నూతనంగా చేపట్టిన అంబులెన్సు(108) సర్వీస్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంహెచ్ ఓ వేంకటేశ్వర రావు, డిప్యూటీ డీఎంహెచ్ ఓ సృజనతో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో నవజాత శిశువుల (పుట్టినప్పటి నుండి 40 రోజుల) సంరక్షణ కై అత్యవసర చికిత్సకోసం అత్యాధునిక వసతులతో, మెరుగైన సౌకర్యాలతో, ఆక్సిజన్, ఇంక్యుబేటర్ తో కూడిన అంబులెన్స్ సర్వీస్ లు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేశారని, ఇందులో భాగంగానే కొండాపూర్ లో ని జిల్లా ఆసుపత్రికి కేటాయించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉట్ల కృష్ణ, జంగం గౌడ్, చాంద్ పాషా, రమేష్ పటేల్, బలరాం యాదవ్, తిరుపతి రెడ్డి, ప్రసాద్, క్రాంతి, తిరుపతి, తిరుపతి యాదవ్, రజినీకాంత్ , గణపతి, యాదగిరి గౌడ్, బసవయ్య, రమేష్, గిరి, రూపరెడ్డి, రవి శంకర్, మంగ గఫుర్, స్థానికులు పాల్గొన్నారు.