నమస్తే శేరిలింగంపల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి సోమవారం ఉదయం గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు, గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము, కేఎల్ నారాయణతో కలిసి మాదాపూర్ లోని వసంత సిటీలోని వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సీత దేవి మరణం చాలా బాధాకరమని, ఆమె రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.