అభివృద్ధికి ఇస్తే.. కబ్జా చేసే

  • మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ హయంలో పార్కుల అభివృద్ధికి ప్రభుత్య భూముల కేటాయింపు
  • నేడు ఆపద్ధర్మ ఎమ్మెల్యే అనుచరులు, తన అనుకూల బిల్డర్ల ఆధీనంలో పార్కులకు కేటాయించిన సర్వే నెంబర్ 174, 188, 239 భూములు
  • అనుచరులు, అనుకూల బిల్డర్లకేమో వేల గజాలు, ఎకరాలు.. కుల సంఘాలకు 250 గజాలా..?
    ఇదేనా మీ పాలన..?
  • మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆరోపణ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ హయాంలో అభివృద్ధి జరిగితే… నేడు కబ్జాలు జరిగి అభివృద్ధి పడకేస్తున్నదని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2013లో కలెక్టర్ సిఫార్సు మేరకు జవహర్ కాలనీ ( నార్త్ ) లో పార్క్ అభివృద్ధి కోసం సర్వే నెంబర్ 174 లో నాటి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ 2 ఎకరాలు కేటాయించారన్నారు. అంతేకాక జవహర్ కాలనీ (సౌత్)కి సర్వే నెంబర్ 188 ప్రభుత్య భూమిని 1 ఎకరా 7 గుంటలు పార్క్ అభివృద్ధికి కేటాయించింట్లు తెలిపారు.

అదేవిధంగా భవాని శంకర్ నగర్ కాలనీకి సర్వే నెంబర్ 239లో 18 గుంటలు భూమిని పార్క్ అభివృద్ధికి కేటాయించినట్లు చెప్పారు. అయితే పార్క్ అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్య భూమి సర్వే నెంబర్ 174 రోజు మీ వెంట తిరిగే అనుచరుడు కబ్జాలో ఉందనీ, ఇదే సర్వే నెంబర్ లో కొంత భూమి ఆక్రమించి ఇతరులకు అమ్ముకున్నాడనీ, మరి కొంత భూమిని జీఓ 58, 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్నాడనీ తెలిపారు. మీ వెంట తిరుగుతున్న వ్యక్తి భూములు ఆక్రమిస్తుంటే మీరు తెలిసి తెలియనట్టు ఉన్నారనీ, దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాలనీ వాసులు ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు 2 సార్లు కూలగొట్టిన మళ్లీ రేకుల షెడ్డు వేశాడాని, మీ సహకారo లేకుంటేనే ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు.

సర్వే నెంబర్ 188లో సగానికి పైగా స్థలం తమరికి అనుకూలంగా ఉండే బిల్డర్ అపార్ట్ మెంట్ నిర్మాణం చేపడ్డడంతో అన్యాక్రాంతం అయిందని తెలిపారు. సర్వే నెంబర్ 239 భవాని శంకర్ నగర్ పార్క్ విషయానికి వస్టే తమరి బంధువుల చేతిలో ఉందని ఇదేనా ప్రజల కోసం మీరు చేసే పాలన అని ప్రభుత్వ విప్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూడ్ కాలనీల వాసులు 30 సార్లు 10 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరిగిన కానీ పార్కులుగా అభివృద్ధి చేయలేదనీ, వారిని చాలా సార్లు బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. మీ అనుచరుల ఆధీనంలో వేల గజాలు భూములు.. కుల సంఘాలు 250 గజలా? ఇదెక్కడి న్యాయం? ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ప్రభుత్య భూములను, పార్కులను నీ అనుచరులు ఆక్రమిస్తుండగా 10 సంవత్సరాలుగా మీరు చూసి చూడనట్టు ఉండటంపై సమాధానం చెప్పాలని అన్నారు.

వెంటనే ఈ పార్క్ భూముల స్థలాలను కబ్జాల నుండి రక్షించి పార్కులుగా అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు తరపున బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుందనీ తెలిపారు. లేకుంటే చట్ట ప్రకారం న్యాయస్థానంలో సవాల్ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here