- వేడుకగా దుర్గమాత ఊరేగింపు
- పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోనీ తారనగర్, లింగంపల్లి, ఆదర్ష్ నగర్ వివిధ కాలనీలలో బుధవారం రాత్రి దుర్గామాత ఊరేగింపు వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్యాలు, మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ, యువతతో డీ.జే స్టేప్పులతో వేసి ఉత్తేజపరిచారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ లోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన, దసరా నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దేవి మాత విగ్రహాల నిమర్జన ఘట్టంలో భాగంగా కన్నుల పండువగా అంగరంగా వైభవంగా ఊరేగింపు కొనసాగుతుందని అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలతో ఐక్యమత్యం పెంపొందుతుందని అన్నారు. ఈ సందర్బంగా ప్రతిఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాసు, సీనియర్ నాయకులు రాఘవరావు, రామ్మోహన్ రెడ్డి, పురం విష్ణువర్ధన్ రెడ్డి, కటిక రామచందర్, పవన్ మండప నిర్వాహకులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.