నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల రమేష్ ఆధ్వర్యంలో వివిధ కాలనీల నుండి బిజెపి పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు, నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరేయడానికి చాలామంది యువత ఎదురుచూస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారినీ సాదరంగా ఆహ్వానించారు. అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారు సంతోష్ ముదిరాజ్, వసంత్, శ్రీను, రాఘవేంద్ర, అజయ్ , మురళి, అరవింద్, మోహన్, నాగరాజు, మహేష్ పార్టీలో చేరారు.