- జెపి నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీని ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మియాపూర్ డివిజన్ పరిదిలోని జేపీ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారానికి ప్రజలనుంచి స్పందన ఉందని, మళ్లీ గాంధీకే మద్దతు అంటూ ప్రజలు చెబుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు , అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.