- ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామంలో ఇంటింటికి పాదయాత్రలో కాంగ్రెస్ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు సరైన న్యాయం జరిగిందని ఆ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మైనారిటీ స్కూల్స్, పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు విద్యార్థులకు చేయూతగా లాప్టాప్స్ రిజర్వేషన్ ఫలాలు ఇలా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్లు చెప్పారు. ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామంలో ఇంటింటికి పాదయాత్రలో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ఎమ్మెల్యేగా నేను గెలిచిన మొదటి రోజు నుండి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు జామీర్ లీమ్ర పాల్గొన్నారు.