- మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రవికుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ గారు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి బసవతారకనగర్, కేశవ్ నగర్, గోపనపల్లి తండా, ఎన్ టీఆర్నగర్ లలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ బిఆరెస్ అవినీతి పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న నాయకుల కబ్జాలకు అంతేలేకుండా పోయిందన్నారు. కబ్జాదారులను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో బిక్షపతి యాదవ్ హయంలో జరిగిన అభివృద్ధి మాత్రమే నేటికీ కన్పిస్తుందన్నారు. మరోసారి అయన కుమారుడు రవికుమార్ యాదవ్ కు గచ్చిబౌలి డివిజన్ లో భారీ మెజారిటీ తో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంత్ రెడ్డి, వసంత్ కుమార్ యాదవ్, హనుమంత్ నాయక్, తిరుపతి, కిషన్ సింగ్, కృష్ణ , వెంకటేష్,గంగాధర్, ఈశ్వర, శ్రీను, రాజు, యాదయ్య, బసవతారకనగర్, కేశవ్ నగర్, గోపనపల్లి తండా, ఎన్ టీ ఆర్ నగర్ కాలనీ వాసులు, స్థానిక నేతలు, సీనియర్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.