- మియాపూర్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి ఇంటింటి ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్, రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్ మెంట్స్, కృషి నగర్, లక్ష్మీ నగర్, మందాడి అపార్ట్ మెంట్స్ లలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సతీమణి సుమలత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి ఆరెకపూడి శ్యామల దేవి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్యామల దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ పక్షపాతి అని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామనే పూర్తి ప్రణాళికను వివరించారన్నారు. కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంపు వంటి పలు కీలక హామీలు ప్రకటించిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ కిరణ్, చంద్రిక ప్రసాద్, రోజా, సుప్రజ, బుచ్చిబాబు, పృథ్వి, రాధిక, ప్రణీత, కుమార్, యుగంధర్, రజిని, శ్యామల, సుప్రజ, కల్పన, సౌజన్య, సుబ్బారెడ్డి, రామారావు, రాకేష్, వెంకటేశ్వర్లు, పవన్, మహేశ్వర్, నాగరాజు కాలనీవాసులు పాల్గొన్నారు.