నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో దసరా పర్వదినం సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా చేపట్టిన పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్, హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర రావు, దామోదర్ రెడ్డి,వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.