నమస్తే శేరిలింగంపల్లి : . శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండాలని బీసీల కోరిక మేరకు జగదీశ్వర్ గౌడ్ ను బీసీ ఐక్యవేదిక కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నందున బీసీ జన జాగరణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మానించినట్లు ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. బీసీల వాటా బీసీలకు దక్కేదాకా పోరాటం ఆగదన్నారు.
బీసీ ఎమ్మెల్యే గెలవాలని బీసీలందరూ పట్టుదలతో ఉన్నారని, బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఏకకంఠంతో జగదీశ్వర్ గౌడ్ ను ఆశీర్వదించి, తమ సహాయ సహకారాలతో గెలిపించుకుంటామని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న, శేరిలింగంపల్లి బీసీ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్, మియాపూర్ అధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షులు తెలుగు నర్సింలు ముదిరాజ్, మీడియా ఇన్ చార్జి రామకృష్ణ గౌడ్, మహిళా అధ్యక్షురాలు వెంకటమ్మ, మియాపూర్ ఉపాధ్యక్షులు నాగరాజు, శేరిలింగంపల్లి కార్యదర్శి కె.నరసింహ యాదవ్, ఎండి కమల్ పాషా పాల్గొన్నారు.