నమస్తే శేరిలింగంపల్లి : రాజ్యాంగం రచించి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, సమాన హక్కులు కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. బాబా సాహెబ్ 133 వ జయంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధి సిద్దిక్ నగర్ లోని అంబేద్కర్ కూడలి వద్ద డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
బడుగు బలహీన వర్గాలకు, అణగారిన పేద ప్రజల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రూపొందించి, సమసమాజంలో సమాన హక్కులు కల్పించిన గొప్ప మానవతావాది బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందు, గణపతి, యాదయ్య గౌడ్, ఆంజనేయులు, వెంకటేష్, విజయ్, రోజారెడ్డి, నరసింహ సాగర్, పి. రామకృష్ణ, దిలీప్, కచ్చావా దీపక్, కుమార్, సాయి, రోజా రెడ్డి పాల్గొన్నారు.