- అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ న్యాయనిపుణుడు, సంఘ సంస్కర్త డా. బి.ఆర్ అంబేద్కర్ అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని లింగంపల్లి డివిజన్, మసీద్ బండ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, మసీదు బండ కాలనీవాసులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశం మొదటి మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రి అంబేద్కర్ ఆశయాలను మనమందరం కలిసి కొనసాగిద్దామని, భారత దేశంలో డాక్టరేట్ సాధించిన మొదటి వ్యక్తి ఆయనేనని, తాగునీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ పెద్ద విగ్రహాన్ని రాబోయే రోజుల్లో ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ్, వినోద్, ప్రభాకర్, దర్శన్, నవతా రెడ్డి , ఏ.బి.వి.పి. నాయకులు మహేష్, రాజేష్ గౌడ్, శ్రీశైలం, రమేష్, రాజు శెట్టి, ఆంజనేయులు, అనంత రెడ్డి, లక్ష్మణ్, శ్రీశైలం, రాయల్, యాదవ్, గణేష్, శ్రీను, అరుణ్ యాదవ్, మహిళా నాయకులు పద్మ, మేరీ, పార్వతి, పవన్, నవీన్ రెడ్డి, నరసింహ, శ్రీను, అనిల్, శ్రీకాంత్, రామకృష్ణ, మన్యం, సాయి, ముకేష్, మాఖన్ సింగ్, గౌస్, రాజు యాదవ్, నరసింహ యాదవ్, కుమార్, దేవేందర్, శ్రీకాంత్, మసీద్ బండ కాలనీ వాసులు పాల్గొన్నారు.