- మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్ క్లేవ్, ప్రజెయ్ షెల్టర్స్, రెడ్డీస్ ఎన్ క్లేవ్, సాయి నగర్, జన చైతన్య కాలనీలో పర్యటన
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతిబస్తి/కాలనీలలోని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్ క్లేవ్, ప్రజెయ్ షెల్టర్స్, రెడ్డీస్ ఎన్ క్లేవ్, సాయి నగర్, జన చైతన్య కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనులు, సుభాష్ నగర్ బస్తీలోని ఇల్లు, రోడ్ల సమస్యలను డివిజన్ నాయకులు, కాలనీ సభ్యులతో కలిసి కాలనీలో ఉన్న పనులను పరిశీలించారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, కాలనీ/బస్తీలను ఆదర్శవంతమైన సుందరంగా తీర్చిదిదేలా, అందరి సమిష్టి కృషితో అభివృద్ధి పనులను చెప్పడం జరుగుతుందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, సాంబశివరావు, నాగేశ్వరరావు, జివి రెడ్డి, నడిమిట్టి కృష్ణ సత్తి రెడ్డి, పాపి రెడ్డి, ప్రతాప్ రెడ్డి,కృష్ణ గౌడ్, ఎం.సి రెడ్డి, రాజేందర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి, రామచందర్, దనుంజయ్, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి, రాజు, విష్ణువర్ధన్, గోపాల్ కృష్ణ, శివ రెడ్డి, రామిరెడ్డి, రణప్రతాప్ రెడ్డి, శివ ప్రసాద్, మహేష్, హనుమంత, సుమంత్, వినయ్, గౌతమ్, కమల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.