- క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు బట్టలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడి
నమస్తే శేరిలింగంపల్లి : క్రిస్మస్ పండుగ చాలా పవిత్రమైన పండుగని, శాంతియుతంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందదాయకంగా సంతోషంగా జరపుకోవాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. రేపు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి చర్చిల వద్ద అన్ని రకాల వసతులు కలిపించాలని, ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించామని, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణంలో పండుగ నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పేద క్రిస్టియన్లకు నూతన బట్టలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.