- మియాపూర్ డివిజన్ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవ్ ఆన్ స్పెషల్ డ్రైవ్
- మియాపూర్, బాచుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్లు, టూవీలర్స్, లారీలపై కేసులు నమోదు
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల్ రాంగ్ సైడ్ డ్రైవ్ ఆన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ఎస్ఐపి నవీన్ కుమార్, ఎస్ఐపి సుభాష్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ కొనసాగింది.
ఇందులో భాగంగా హెచ్ డీఎఫ్సి బ్యాంక్ యూటర్న్ వద్ద రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలు (13) దీప్తి శ్రీనగర్ యూటర్న్ వద్ద 10 మోటార్ సైకిల్, బాచుపల్లి సిగ్నల్ వద్ద లారీలపై మియాపూర్ , బాచుపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంగ్ రూట్లో ప్రయాణం రోడ్డు ప్రమాదాలకు దారీ తీస్తుందని, రాంగ్ రూట్ లో వాహనాలు నడపకూడదని తెలిపారు. ట్రాఫిక్ నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.