నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో అన్నమ స్వరార్చన మైమరపించింది. మొదట విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమయ్య అష్టోత్తరం, “శ్రీ నందకాయ” అన్నమ గాయత్రి “శ్రీ మద్వదీయ” అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభించారు.
అనంతరం “నృత్య మయూరి కళానికేతన్” గురువు జయంతి నారాయణ శిష్యులు “నైవేద్య, తేజస్వి, ఆరాధ్య, మనస్వి, రిషి ప్రియ, సాహితి, సృష్టి, శ్రీనిధి కయాతి, శ్రీనిధి, మేఘన, లేక్షన, విష్ణుప్రియ” సంయుక్తంగా అన్నమయ్య సమేత శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి కూచిపూడి నృత్యంతో “గణపతి కీర్తన, వరవీణ గీతం, రుక్మిణీ ప్రవేశ దరువు, రామాయణ శబ్దం, రాధిక కృష్ణ అష్టపది, అన్నమాచార్య కీర్తన, పురందరదాసు దశావతార మంగళం” అనే ప్రఖ్యాత సంకీర్తనలకు నృత్య ప్రదర్శనతో తమ తమ నైపుణ్యతను చాటుకున్నారు. తదనంతరం సంస్థ మేనేజింగ్ ట్రస్టి డా. నంది కుమార్ నృత్య కళాకారులను శాలువాతో సంస్థ జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చారు.