- ధర్మపురి క్షేత్రంలో 6వ రోజు వేడుకగా వసంత నవరాత్రోత్సవాలు
నమస్తే శేరిలింగంపల్లి : ధర్మపురి క్షేత్రంలో వసంత నవరాత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, చిన్నారుల గద్యపద్యాలు ఎంతో మురిపించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భాస్కర డాన్స్ అకాడమీ ఉపాధ్యాయురాలు సాత్విక శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది.
ఘట్టిబాల చైతన్యం నుంచి ఘట్టి కృష్ణమూర్తి చిన్నారులు గద్య పద్యాలను అమ్మవారిని, దేవి దేవతలను ఎంతో మురిపించారు. ఈ సందర్భంగా అనంతరం ఘట్టికృష్ణమూర్తిని, సాత్వికను ఆలయ వ్యవస్థాపకురాలు సత్యవాణి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారులు స్పష్టమైన ఉచ్ఛారణతో గద్యపద్యాలు పలికి సరస్వతి అమ్మవారిని, దేవీ దేవతలను మురిపించేలా చేశారన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు.