- తనిఖీ చేసి పరిశీలించిన ఏఆర్ఓ స్నేహ శబరిష్
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి (ఆదివారం) వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో జరిగిన హోం ఓటింగ్ ను నియోజకవర్గ ఏఆర్ఓ స్నేహ శబరిష్ శనివారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జరుగుతున్న ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం శబరీష్ మాట్లాడుతూ 5వ తేదీ వరకు హోం వోటింగ్ కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 85 సంవత్సరాలు నిండిన వృద్ధులు, వికలాంగులు అత్యవసర సేవలకు సంబంధించిన వారు హోం వోటింగ్ ద్వారా ఇంటి వద్ద ఓటు వేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం జోనల్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించాలని అధికారులకు ఏ ఆర్ ఓ సూచించారు.