నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రగతి భవన్ లో ఐటీ, పరిశ్రమల, పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావుని టీఆర్ఎస్ హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వాలా హరీష్ రావు తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో హాఫిజ్ పెట్ 109 డివిజన్ లో ముందుండి భారీ మెజారిటీ సాధించాలని చెప్పారు. గడప గడపకు ప్రచారం చేసి మరోసారి శేరిలింగంపల్లిలో జెండా ఎగురవేస్తామని, ప్రభుత్వ విప్ గాంధీ నీ గెలిపించుకుంటామని బాలింగ్ గౌతమ్ గౌడ్ తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ కి పూల బొకే అందించి దసరా శుభాకాంక్షలు తెలిపారు.