నమస్తే శేరిలింగంపల్లి : భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీ లో దసరా పర్వదినం సందర్భంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా చేపట్టిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్ , నాగమణి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి , ఎంఐజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భగవాన్, రాకేష్, నరేందర్ బల్లా, కొండల్ పాల్గొన్నారు.