- ఎంఐజి కాలనీలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాంధీ ప్రచారం
- ఘన స్వాగతం పలికిన మహిళామణులు, ప్రజలు
- భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం ను ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యమని ప్రభుత్వ విప్ గాంధీ జోష్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతినగర్ డివిజన్ పరిధి ఎంఐజి కాలనీలో శ్రీ పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, ర్యాలీతో బయలుదేరి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించి తదనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మోహన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, ఎం ఐ జి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలషులు పాల్గొన్నారు.