నమస్తే శేరిలింగంపల్లి: తొమ్మిది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రజలను కోరారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ, సత్య ఎంక్లేవ్, సురక్ష హిల్స్, సురక్ష ఎంక్లేవ్, విధ్యానగర్ కాలనీ, డిఫెన్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీ పలు కాలనీలలో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాలతో కలిసి మంజుల రఘునాథ్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అబివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ, హరితహారం అమలు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, గురుచరణ్ దూబె, పులిపాటి నాగరాజు, ధనలక్ష్మి, ఓర్సు వెంకటేశ్వర్లు, పబ్బ మల్లేష్ గుప్త, లక్ష్మారెడ్డి, అక్బర్ ఖాన్, యూసుఫ్, ఎల్లమయ్య, పారువంది శ్రీకాంత్, నరేందర్ భల్లా, రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఉదయ్, రాహుల్, సికిందర్, కాలనీవాసులు రఘుపతిరెడ్డి, మహేందర్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, హుస్సేన్ పాల్గొన్నారు.