సందడిగా మెగా క్రిస్మస్ వేడుకలు

  • క్రిస్మస్ సందేశాన్ని అందించిన సువార్తికులు బిషప్ దీవెన్ కుమార్
  • శేరిలింగంపల్లిలో క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ గాంధీ హామీ
మెగా క్రిస్మస్ వేడుకలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని PJ R స్టేడియంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రోజా దేవి రంగా రావు, నార్నే శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో నివసిస్తున్న క్రిస్టియన్ల కోసం ప్రత్యేకంగా క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ హామీ ఇచ్చారు. నగరంలోని ఉప్పల్ భగాయత్ లో క్రిస్టియన్ భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోజే శేరిలింగంపల్లిలో మెగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రిస్టియన్ మైనారిటీలకు ఉపయోగపడేలా అన్ని రకాల ఆధునిక హంగులతో కమ్యూనిటీ హాళ్లు.. మోడరన్ బరియల్ గ్రౌండ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ వెల్లడించారు. అంతకు ముందుగా సువార్తికులు బిషప్ దీవెన్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఉత్సవాల కమిటీ కన్వీనర్లు రెవరెండ్ ఎడ్వర్డ్ రోజ్, రెవరెండ్ యేసుపాదం, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ విప్పర్తి, రెవరెండ్ పీ. ఇజ్రాయేల్, కేఆర్డీవీ ప్రసాదరావు, టీఆర్ రాజు, విద్యా సాగర్ కొమ్ము, యేసు రాజు, స్వామితో పాటు క్రిస్టియన్ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.

వేడుకలలో పాల్గొన్న వారికి భోజనం వడ్డిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here