నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి రూ. 63వేల 500 మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, గంగాధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.
బాధితుల వివరాలు..
1.ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన స్వాతికి రూ. 24, 500 వేలు
2.ఆస్బెస్టాస్ కాలనీ కి చెందిన రాజశేఖర్ రెడ్డికి రూ. 21,000వేలు
3.పాపిరెడ్డి నగర్ కాలనీ కి చెందిన లక్ష్మినాయుడుకి రూ. 18,000 మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు.
ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వర్ రావు, చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి, అబుల్, మాయ బాల నరసయ్య, స్వామి, లక్ష్మణ్ నాయుడు, రాజు పాల్గొన్నారు.