- ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్, ముజఫర్ అహ్మద్ నగర్ లో 23, 24 తేదీలలో జరిగే ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ పిలుపునిచ్చారు. ముజఫర్ అహ్మద్ నగర్ లో జరిగిన యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలలో భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఇలాంటి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్యం, రాష్ట్రంలో గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను అనేక సమస్యల సుడిగుండంలో నెట్టివేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ప్రభుత్వాలు పెట్టుబడి దారి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యత కార్యక్రమాలు సమావేశాలు రూపొందిస్తుందని అన్నారు. రెండు రోజుల ఈ సమావేశాలను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, సామజిక శక్తులు జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చినారు. ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.దశరథ్ నాయక్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసీపీఐ(యూ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదంశెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కమిటీ సభ్యులు కుంభం సుకన్య, పి.భాగ్యమ్మ, ఎ పుష్ప, తాండ్ర కళావతి, వి.తుకారాం నాయక్, కర్ర దానయ్య, పల్లే మురళి, ఇ.దశరథ్ నాయక్, డి. మధు సుధన్, యం.డి.నజీర్ పాల్గొన్నారు.