- చేవెళ్ల పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డికి కృతజ్ఞత సభ
- సభ్యులతో పలు తీర్మానాల ఆమోదం
- బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి: జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి
- కాంగ్రెస్ ఇచ్చిన అమలు కాని హామీలపై, స్థానిక సమస్యలపై పోరాటం చేద్దాం : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ క్రిస్టల్ గార్డెన్స్ లో రంగారెడ్డి(అర్బన్) జిల్లా కార్యవర్గ సమావేశం, శేరిలింగంపల్లి నియోజకవర్గ కృతజ్ఞత సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి, అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ముందుగా బీజేపీ జెండాను ఆవిష్కరించి ముఖ్య నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల సమక్షంలో పలు తీర్మానాలను ఆమోదించి భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలను ఉపన్యసించారు. ఈ సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ ఖ్యాతిని పెంపొందించడానికి ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన శ్రమ,పట్టుదల వల్లే ఎన్నో సాధ్యం కానీ గొప్ప గొప్ప పనులు సుసాధ్యం అయ్యాయని కొనియాడారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన శేరిలింగంపల్లి ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం లేకుండా ఈర్ష బేదాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా పని చేయాలని, నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని తెలిపారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ రావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిలో 1. రాజకీయ తీర్మానం, 2. జిహెచ్ఎంసి సమస్యలపై తీర్మానo, 3. ఇందిరమ్మ ఇండ్లపై తీర్మానం, 4. రేషన్ కార్డులు, 5. మహిళా తీర్మానం, సంతాప సభలు, 6. మండల కార్యవర్గ సమావేశాలు ఎలా జరుపుకోవాలో పలు విషయాలపై చర్చించుకుని ఎప్పటికప్పుడు సమస్యలపై ప్రజా పోరాటం చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు, కో కన్వీనర్ మణి భూషణ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరేష్, నరేందర్ రెడ్డి, ప్రేమ్ మహేందర్ రెడ్డి, రవీందర్ గౌడ్, పవన్ సీనియర్ నాయకులు అశోక్, నాగులు గౌడ్, వసంత్ యాదవ్ రామరాజు, అరుణ్ నవతారెడ్డి, వినయ, పద్మ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, మహిళా మోర్చా యువ మోర్చా డివిజన్ల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.