మియాపూర్: ఎంసిపిఐ(యు) రాష్ట్రకమిటి సభ్యులు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ తేలు రాజలింగం ఆకస్మిక మరణం కార్మిక, బహుజన ఉద్యమాలకు తీరని లోటు అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్ పేర్కొన్నారు. బీబీపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజలింగంకు పార్టీ, యూనియన్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన రాజలింగం వామపక్ష భావజాలంకు ఆకర్షితుడై నిత్యం ప్రజా సమస్యలపై, కార్మిక సమస్యలపై, హక్కులకై అలుపెరుగని ఉద్యమాలు చేపట్టాడాని తెలిపారు. యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా, ఎఐటియుసి రాష్ట్ర నాయకుడిగా, బి ఎల్ ఎఫ్ నాయకుడిగా పనిచేసిన ఆయన యంసిపిఐ పార్టీ బలోపేతానికి, లాల్ నీల్ ఐక్యత కోసం, బహుజనలకే రాజ్యాధికారం కొరకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) ను బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారని తెలిపారు.
ఆయన ఆకస్మిక మరణం బహుజన, కార్మిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ యంసిపిఐ(యు)& AICTU రాష్ట్ర కమిటీల తరపున నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టి.అనిల్ కుమార్, డి.మధుసూదన్ ,ఎల్. రాజు, బి.రవి , A.పుష్ప, కే సుకన్య , ఏ పుష్ప ,పల్లె మురళి ,అమీనా బేగం వినోద్ తదితరులు పాల్గొన్నారు.