- ఎంసిపిఐ యూ సదస్సులో కమ్యూనిస్టు పార్టీల నేతలు
నమస్తే శేరిలింగంపల్లి: “పెరుగుతున్న బిజెపి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష కమ్యూనిస్టు శక్తుల కర్తవ్యం” అనే అంశంపై బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్, బి.యన్.హాల్ లో ఎంసిపిఐ యూ రాష్ట్ర ఆధ్వర్యం లో సదస్సు నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వం హాజరై మాట్లాడుతూ..దేశంలో బిజెపి పాసిజం, మతోన్మాదం పై ప్రజా పోరాటాలు నిర్మించి ఐక్యంగా పోరాడుదామని అభిప్రాయం వ్యక్త పరిచారు. సదస్సు ప్రారంభం ముందు ఎంసిపిఐ యూ రాష్ట్ర కార్యదర్శి గాదగొని రవి తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం గాదగోని రవి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మేధావులను, కవులను, కళాకారులను, హక్కుల నేతలను, జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, ప్రజాతంత్ర వాదులను ఉపా, రాజద్రోహం, దేశద్రోహం, అర్బన్ నగ్జల్ అనే ముద్ర వేసి జైల్లో పెడుతుందని అన్నారు. బి జె పి దాని విధానాలను బలపరిచే ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఐక్య ఉద్యమాలు చేపట్టాలని, అందుకు ఎంసిపిఐ యూ నిరంతర కృషి చేస్తుందని అన్నారు. CPI(ML) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ గుర్రం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాషాయికరణతో బిజెపి పార్టీ బలపడడం కాంగ్రెస్ లౌకికం పేరు కొనసాగిన మత విధ్వంసం కూడా కారణమే. కేంద్ర, రాష్ట్రాలను పాలించే వారు ప్రజలకు నష్టం కలిగించే విధానాలను సృష్టిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. SUCI(C) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సి హెచ్ మురాహరి మాట్లాడుతూ ఇది వరకు ప్రపంచ దేశాల లో నియంతృత్వం కార్మికా ప్రజా పోరాటాలతో అణచబడిందని , మన దేశంలో బిజెపి మతోన్మాద విధానాలను ప్రజాపోరాటలతో కమ్యూనిస్టుల ఐక్యత తో తిప్పుకోవాలని అన్నారు. CPI ML న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చలపతి రావు, CPI(ML) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి సైదయ్య కూడా మాట్లాడారు. MCPI(U) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ కుంభం సుకన్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు వనం సుధాకర్, వి తుకారాం నాయక్ రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర కళావతి, పల్లె మురళి, ఈ. కిష్టయ్య, ఈ దశరథ్ నాయక్, కర్ర దానయ్య, బి యాదగిరి, దుర్గ ప్రసాద్, దేవనూరి లక్ష్మి, యాదగిరి పాల్గొన్నారు.