నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీప్తీ శ్రీ నగర్ ధర్మపురి టెంపుల్ రోడ్డుకు 10 మీటర్ల దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(30-35) మృతదేహాన్ని గుర్తించారు. మద్యం మత్తులో బండరాళ్లపై పడిపోయి ఉండవచ్చని తెలుస్తున్నది. తల ముందు భాగం, కుడి కంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈక్రమంలో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు మియాపూర్ పీఎస్ లో సమాచారం అందించాలను సూచించారు.